Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 26 January 2023, 9:51 pm Posted by : Anjaneyulu Dega

పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేత.

ఆంజనేయులు న్యూస్: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత సంవత్సరం రాష్ట్ర స్థాయిలో ఉత్కృష్ట సేవా పతకములు పొందిన పోలీస్ అధికారులు, సిబ్బందికి గురువారం నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో డీసీపీ అడ్మిన్ అఖిల్ మహాజన్ ప్రశంస పత్రాలు అందజేశారు. ఉత్కృష్ట పతకం పొందిన ఇన్స్పెక్టర్ సయ్యద్ అఫ్టల్ ఉద్దీన్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, సేవా పతకం పొందిన ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు, ఎస్సైలు ఎండి ఇమియోద్దీన్, ప్రసాద్ శర్మ, ఏఎస్సైలు రవీందర్, సత్యనారాయణ, లక్ష్మణ్, లక్ష్మి రాజం, హెడ్ కానిస్టేబుల్ గిరి, అజీజ్ బేగ్, కానిస్టేబుల్ రవి, రమేష్ లకు ప్రశంస పత్రాలను అందించారు.