కలెక్టర్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

మంచిర్యాల కలెక్టర్ భారతి హోలీకెరీ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో గురువారం జరిగిన 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ భారతి హోలీ కెరీ పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మహాత్మాగాంధీ ఫోటోకు నివాళులర్పించి జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు డిసీపీ అఖిల్ మహాజన్ తో కలిసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఎంపి బోర్లకుంట వెంకటేష్...