Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 21 January 2023, 11:10 am Posted by : Anjaneyulu Dega

నంబర్ ప్లేట్ కు మాస్క్ అడ్డు పెట్టిన వాహనదారునికి జరిమాన

నంబర్ ప్లేట్ కు మాస్క్ అడ్డు పెట్టిన వాహనదారునికి జరిమాన విధించిన మంచిర్యాల పోలీసులు.

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రజల్లో మార్పు తేవడమే లక్ష్యంగా వాహనదరులపై మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిదిలో గత కొద్దీ రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తు వాహనదారులకు అవగాహనా నిర్వహిస్తూ ఇ. చలాన్స్ జరిమానా విధించడం జరుగుతుంది అయినా కూడా కొంతమంది నిబందనలకు విరుద్దంగా, ఇష్టారీతిన నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేయడం చేస్తున్నారు. కొందరు వాహనదారులు ట్రాఫిక్ ఈ చలాన్ నుంచి తప్పించుకోవడం కోసం వాహనాలపై ఫ్యాన్సీ నంబర్ తో పాటు తప్పుడు నంబర్ లు సైతం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆయా నంబర్ ప్లేట్లపై వివిధ ఆకారాలు, డిజైన్లు, పదాలు, అక్షరాలు గుర్తించలేనంతగా ఉంటున్నాయి. ఇంకా కొందరు ఏకంగా మాస్క్ అడ్డుగా వేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం వాహన తనిఖీల్లో పట్టుబడిన వాహనదారుడు తన వాహనం నెంబర్ కనబడకుండా మాస్క్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అట్టి వాహనదారునికి కౌన్సిలింగ్ నిర్వహించి చలాన్ విధించామని మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. నిబందనలకు విరుద్దంగా నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేసి వాహనం నడిపితే వాహనదారుడిపై ఛీటింగ్ కేసులను నమోదు చేయబడుతాయని వాహనదారులను హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ. వాహన రిజిస్ట్రేషన్ నంబర్ ను మార్పు చేసిన, నంబర్లపై స్టిక్కర్లుగాని, నంబర్ ప్లేట్ కనిపించకుండా మాస్కులను తగిలించిన, నంబర్ ప్లేట్ ను వంచిన వాహనదారులపై కూడా ఛీటింగ్ కేసులను నమోదు చేయబడుతాయని. ముఖ్యంగా వాహనాదారులు తమ వాహనాలకు రవాణా శాఖ రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించిన కూడా వాహనదారులు తమ వాహనాలపై రిజిస్ట్రేషన్ నంబర్ ను ఏర్పాటు చేసుకోకుండా వాహనం నడిపిన అలాంటి వాహనదారులపై కూడా ఛీటింగ్ కేసులను నమోదు చేయబడుతాయని మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ నారాయణ వెల్లడించారు.