ఆ లింకులను బ్లాక్ చేయండి.. ట్విటర్, యూట్యూబ్ కు కేంద్రం ఆదేశాలు..!
బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై కేంద్రం మరికొన్ని చర్యలు చేపట్టింది. దానికి సంబంధించిన లింకులను బ్లాక్ చేసేలా ఆదేశాలు ఇచ్చింది. ఆంజనేయులు న్యూస్, ఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోదీ పై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ వివాదం రాజేసింది. దీనిపై ఇదివరకే కేంద్రం తీవ్రంగా స్పందించగా.. తాజాగా మరికొన్ని చర్యలు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆ డాక్యుమెంటరీ లింకులను బ్లాక్ చేయాలని ట్విటర్ యూట్యూబ్ లను కేంద్రం ఆదేశించినట్లు ఆ వర్గాల సమాచారం. 2002 గుజరాత్ అల్లర్లలో కొన్ని కోణాలను అధ్యయనం చేసి వాటి ఆధారంగా...