
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: తెలంగాణ టీచర్స్ & హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో బెల్లంపల్లి సీఐటీయు కార్యాలయంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షురాలు ఈ. భానుమతి అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ సందర్బంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ. అంగన్వాడీ ఉద్యోగులు గత 40 సంవత్సరాలుగా పనిచేస్తూ పేద ప్రజలకు సేవలు అందిస్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాల్లో రిటర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, పండగ బోనస్ తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకరమ్మ, అనురాధ, మహేశ్వరీ, సరిత, సత్యవతి, పద్మావతి ఉమాదేవి, అరవింద, విజయ, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.