Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 19 January 2023, 3:08 pm Posted by : Anjaneyulu Dega

వాసవి క్లబ్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: వాసవి క్లబ్ మంచిర్యాల 2023 సంవత్సర నూతన క్యాలెండర్ ఆవిష్కరణను వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సన్నిధిలో గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక విశ్వనాథ ఆలయ ప్రాంగణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో  ముఖ్య అతిథి అంతర్జాతీయ వాసవి క్లబ్ సీనియర్ ఉపాధ్యక్షులు ముక్త శ్రీనివాస్ చేతుల మీదుగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమం అర్చకులు  బాలకృష్ణ శర్మచే నిర్వహించి క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో, అంతర్జాతీయ వాసవి క్లబ్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ పుల్లూరి బాలమోహన్, రీజియన్ చైర్మన్  కుంకుమటి వెంకటేష్  , రీజన్ సెక్రటరీలు  కాచం సతీష్ , శ్రీమతి సిద్ధంశెట్టి మధుశ్రీ, జోన్ చైర్మన్ కేశెట్టి వంశీకృష్ణ , వాసవి క్లబ్ అధ్యక్షులు నలమాసు ప్రవీణ్, సభ్యులు గంప నాగేందర్, నరేందుల సంతోష్ ,నలమాస్ రమేష్, వనిత క్లబ్ అధ్యక్షురాలు మోటూరి సరిత , కార్యదర్శి స్వప్న, ముక్త రమాదేవి, కపుల్స్ క్లబ్ అధ్యక్షులు అయిత శ్రీనివాస్, కార్యదర్శి చిటుమల శ్రీనివాస్ తో పాటు సభ్యులు పాల్గొన్నారు.