Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 19 January 2023, 2:57 pm Posted by : Anjaneyulu Dega

సంపూర్ణ అంధత్వ నివారణ కోసమే కంటి వెలుగు

మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రాష్ట్ర ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ యూపీహెచ్సీలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కంటి పరీక్షలను పరిశీలించి, అవసరమైన వారికి అద్దాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ వైద్య రంగంలో 3 విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణ అంధత్వ నివారణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని, దవాఖానలకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్న ఎంతో మంది పేదలు, అభాగ్యుల జీవితాల్లో కంటి వెలుగు ద్వారా వెలుగులు నింపుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.