Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 15 January 2023, 4:58 pm Posted by : Anjaneyulu Dega

బ్లూ కొర్ట్ సిబ్బందిని అభినందించిన ఎస్పీ

డయాల్ 100 కాల్ కి తక్షణమే స్పందించిన బ్లూ కోర్ట్  సిబ్బంది

బ్లూ కొర్ట్  సిబ్బందిని అభినందించిన ఎస్పీ సింధు శర్మ

ఆంజనేయులు న్యూస్, జగిత్యాల జిల్లా: కొరుట్లలో శనివారం అర్ధరాత్రి ఎస్బిఐ బ్యాంక్ దగ్గర ఉన్న ఏటీఎంలో చోరీ జరుగుతుందని అలారం ద్వారా తెలుసుకున్న బ్యాంక్ వారు డయల్ 100 ద్వారా కోరుట్ల ఎస్సై సతీష్ కి సమాచారం అందించారు. ఎస్సై సతీష్ బ్లూ కోల్డ్ సిబ్బందిని అలర్ట్ చేయగా. తక్షణమే స్పందించిన బ్లూ కోర్ట్ సిబ్బంది ఏటీఎం నుండి రూ. 19,00, 200 డబ్బును దొంగతనం చేసి కారులో పారిపోతుండగా అడ్డుకొని డబ్బులను రికవరీ చేసారు. ఈ సంఘటనలో చాకచక్యంగా వ్యవహరించి డబ్బులను రికవరీ చేసిన ఎస్ఐ సతీష్, హెడ్ కానిస్టేబుల్ మెడి రాజయ్య, కానిస్టేబుల్ గట్టు శ్రీనివాస్, ప్రైవేట్ డ్రైవర్ మధులను జిల్లా ఎస్పీ సింధు శర్మ అభినందించారు. ఏటీఎం చోరీ నిందితుల కోసం జగిత్యాల డిఎస్పి ప్రకాష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.