మంత్రి గంగులను పరామర్శించిన బండి సంజయ్

ఆంజనేయులు న్యూస్, కరీంనగర్ జిల్లా: రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర మరియు ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య (85) ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకొని శుక్రవారం రాత్రి తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మంత్రి కమలాకర్ నివాసానికి వెళ్ళి, మల్లయ్య చిత్రపటం వద్ద పూలు చల్లి, నివాళులు అర్పించారు. మంత్రి కమలాకర్ ను పరామర్శించారు. మల్లయ్య మృతి పట్ల సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం...