నిషేధిత మాదక ద్రవ్యాలు విక్రయిస్తే కఠిన చర్యలు

మంచిర్యాల కలెక్టర్ భారతి హోళ్ళికేరి ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో నిషేధిత మాదక ద్రవ్యాలు విక్రయించినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ చాంబర్ లో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిషేధిత మాదక ద్రవ్యాల విక్రయం, వినియోగంపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు కార్యచరణ రూపొందించాలని, ఎవరైనా విక్రయించినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం...