Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 12 January 2023, 9:33 pm Posted by : Anjaneyulu Dega

కేసీఆర్ చేసిన అభివృద్ధి ప్రజల్లోకి తీసుకెళ్లాడమే లక్ష్యం.

నడిపెల్లి ట్రస్ట్ యువ నేత నడిపెల్లి విజిత్ రావు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: దండేపల్లి మండలం రెబ్బనపల్లి గ్రామంలో నడిపెల్లి ట్రస్ట్ యువ నేత నడిపెల్లి విజిత్ రావు ఇంటింటికి పాదయాత్ర కార్యక్రమం భాగంగా మంచిర్యాల శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు ఆదేశాల మేరకు గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ 8 సంవత్సరాల నుండి అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా చేరుతున్నాయి. అనే కార్య క్రమంలో భాగంగా ఏదైనా సమస్య ఉన్నచో ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి ఆ సమస్యను పరిష్కరించే మార్గంగా జరుగుతుందన్నారు. పథకాలు ప్రజలను అడిగి వారి సమస్యలను వింటూ ముందుకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో రైతు జిల్లా అధ్యక్షులు మోట పలుకులు గురవయ్య, దండేపల్లి ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, కొరివిచల్మా ఎంపిటిసి ముత్తెరాజయ్య, స్థానిక సర్పంచ్ కందుల కళ్యాణి అశోక్, మాజీ సర్పంచ్ కొట్టే సత్తయ్య, మండల పార్టీ అధ్యక్షులు చుంచు శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి బండారు మల్లేష్, నాయకులు గొల్ల పూరెల్ల లక్ష్మణ్ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.