బూజు పట్టిన లడ్డూ ప్రసాదాల విక్రయం.. భక్తుల ఆందోళన
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో బూజు పట్టిన లడ్డూ ప్రసాదాలను విక్రయిస్తున్నారంటూ భక్తులు ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు. బూజు పట్టిన లడ్డు ఆంజనేయులు న్యూస్, భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో బూజు పట్టిన లడ్డూ ప్రసాదాలను విక్రయిస్తున్నారంటూ భక్తులు ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు. ఓ పాఠశాలకు చెందిన విద్యార్థులు తీర్థయాత్రలో భాగంగా రామయ్యను దర్శించుకున్నారు. కౌంటర్ లో రూ.25 విలువ గల లడ్డూలను కొన్నారు. వీటి రుచిలో తేడా కనిపించింది. వాటి పైభాగంలో బూజు పట్టడంతో పాటు నల్లటి మచ్చలున్నాయి. ఇంకొన్ని దుర్వాసన...