విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలలో రాణించాలి

మంచిర్యాల కలెక్టర్ భారతి హోళ్ళికేరి ఆంజనేయులు న్యూస్,, మంచిర్యాల జిల్లా: విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలలో ముందుండాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల జిల్లా కలెక్టర్ చాంబర్ లో జిల్లా స్థాయి యువజనోత్సవాలలో పాల్గొని రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజన ఉత్సవాలలో ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలకు చెందిన ఇంటర్ విద్యార్థులు వివిధ విభాగాలలో పాల్గొని...