Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 07 January 2023, 7:45 pm Posted by : Anjaneyulu Dega

జిల్లాకు రాష్ట్ర మంత్రి రాక

అడిషనల్ పి.ఎస్. టు మినిస్టర్ కె. చంద్రశేఖర్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 18వ తేదీ నుండి కంటి వెలుగు కార్యక్రమం చేపట్టనున్న నేపథ్యంలో ఈ నెల 8వ తేదీన ఉదయం 10.30 గం||లకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల లెక్చర్ హాల్ నందు కంటి వెలుగు కార్యక్రమ సన్నాహక ఏర్పాట్లపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరవుతున్నట్లు అడిషనల్ పి.ఎస్. టు మినిస్టర్ కె.చంద్రశేఖర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్.పి.టి.సి.లు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, వైద్యాధికారులు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు ఈ సమావేశానికి హాజరు కావాలని తెలిపారు.