
బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: బిజెపి రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 అసెంబ్లీ పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తల మహా సమ్మేళనాన్ని శనివారం మంచిర్యాల బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి మంచిర్యాల అసెంబ్లీ లోని 279 పోలింగ్ బూత్ కార్యకర్తలు 2000 మందికి పైగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ.. మంచిర్యాల అసెంబ్లీ లో గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరియు ఇప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలు అసెంబ్లీనీ అభివృద్ధి చేయడంలో విఫలం అయ్యారని రెండు పార్టీలు మంచిర్యాల అభివృద్ధిని మరిచి ప్రజల సొమ్మును దోచుకున్నారే తప్ప మంచిర్యాలను అభివృద్ధి చేయలేదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను, మంచిర్యాల అబివృద్దికి ఇచ్చిన హామీలను, పేద ప్రజలకు ఇచ్చిన హామీలను మరియు సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం అయింది అని అన్నారు. మంచిర్యాల అసెంబ్లీ అభివృద్ది చెందాలంటే బిజెపి అధికారంలోకి వస్తేనే సాధ్యం అని, రైతుల సమస్యలు, సింగరేణి కార్మికుల సమస్యలు మరియు పేద ప్రజల కష్టాలు తీర్చేది కేవలం బిజెపి పార్టీయే అని అన్నారు. కార్యకర్తలు అందరూ వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుండి అహర్నిశలు కష్టపడి పని చేయాలని పిలుపిచ్చారు. ఈ జిల్లా ఇంచార్జి పల్లే గంగా రెడ్డి, గోనె శ్యామ్ సుందర్ రావు, పురుషోత్తం జాజు, పోనుగోటి రంగ రావు, పెద్దపెల్లి పురుషోత్తం, తోట మల్లికార్జున్, రజినిష్ జైన్, ఆనంద్ కృష, ఆకుల అశోక్ వర్ధన్, కర్ణ శ్రీధర్, మోటపలుకుల తిరుపతి మరియు తదితరులు పాల్గొన్నారు.