Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 04 January 2023, 10:43 pm Posted by : Anjaneyulu Dega

జిల్లా స్థాయి యువజనోత్సవాలు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరుగనున్న యువజనోత్సవాలలో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా క్రీడా, యువజన శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ యూత్ సర్వీసెస్, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని మైనారిటీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాలను మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైసైచైర్మన్ ముఖేష్ గౌడ్ కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. 26వ జాతీయ యువజనోత్సవాల సందర్భంగా జిల్లా పౌర సంబంధాల అధికారి ఆదేశానుసారం యువజోత్సవ కార్యక్రమం లో భాగంగా తెలంగాణ సాంస్కృతిక సారధి మంచిర్యాల, కళాకారులు. తమ ఆట పాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు లావుడ్యా రమేష్, మామిళ్ల లచ్చన్న, ముల్కల్ల మురళి,పోషం, రవీందర్, నిరోసా, కృష్ణ, సంతోష్, రాజేష్ పలువురు కళాకారులు పాల్గొన్నారు.