Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 01 January 2023, 11:55 am Posted by : Anjaneyulu Dega

కారు బీభత్సం.. గాల్లోకి ఎగిరిపడి ఇద్దరి దుర్మరణం

నూతన సంవత్సరం తొలి రోజు హైదరాబాద్ లో విషాదం. చోటుచేసుకుంది. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 3లో ఓ కారు బీభత్సం సృష్టించడంతో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు.

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: నూతన సంవత్సరం తొలి రోజు నగరంలో విషాదం చోటుచేసుకుంది. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 3లో ఓ కారు బీభత్సం సృష్టించడంతో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. జూబ్లీహిల్స్ చెకోపోస్టు నుంచి పంజాగుట్ట వైపు వెళ్తున్న టీఎస్ 07 ఎక్స్ 5195 నంబరు గల కారు రాయల్ టిఫిన్ సెంటర్ వద్ద డివైడర్ ను ఢీకొని అదుపు తప్పింది. ఈ క్రమంలో మరో రెండు కార్లను ఢీకొట్టింది. అదే సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ, మరో వ్యక్తిని బలంగా ఢీకొనడంతో వారు గాల్లోకి ఎగిరి కిందపడి అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మద్యం తాగి వాహనం నడిపినట్లు పోలీసులు గుర్తించారు. మృతుల వివరాలను సేకరిస్తున్నారు.