వేడుకలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు మంచిర్యాల ఎసిపి తిరుపతి రెడ్డి ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలో వినోదం విషాదంగా మారకుండా వేడుకలు జరుపుకోవాలని మంచిర్యాల ఎసిపి తిరుపతి శనివారం సూచించారు. ఈ సందర్భంగా ఎసిపి మాట్లాడుతూ.. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాత్రి 12 గంటల తర్వాత రోడ్లపై కేకులు కట్ చేసినా, డీజే లు పెట్టి డాన్సులు చేసినా, మద్యం సీసాలతో బహిరంగంగా తాగుతూ కనిపించిన మరియు యువకులు మద్యం మత్తులో వేగంగా వాహనాలు నడిపిన...