Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 31 December 2022, 10:23 am Posted by : Anjaneyulu Dega

వేడుకలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు

మంచిర్యాల ఎసిపి తిరుపతి రెడ్డి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలో వినోదం విషాదంగా మారకుండా వేడుకలు జరుపుకోవాలని మంచిర్యాల ఎసిపి తిరుపతి శనివారం సూచించారు. ఈ సందర్భంగా ఎసిపి మాట్లాడుతూ.. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాత్రి 12 గంటల తర్వాత రోడ్లపై కేకులు కట్ చేసినా, డీజే లు పెట్టి డాన్సులు చేసినా, మద్యం సీసాలతో బహిరంగంగా తాగుతూ కనిపించిన మరియు యువకులు మద్యం మత్తులో వేగంగా వాహనాలు నడిపిన వారిపై వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ, ప్రజల ఆస్తులు ధ్వంసం చేస్తే వారిపై కేసులు ఉంటాయన్నారు. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని తెలిపారు. అనంతరం మంచిర్యాల పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు..