
మంచిర్యాల మండల తహసిల్దార్ రాజేశ్వర్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రభుత్వం పేదవారికోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు పడక గదుల ఇండ్ల పథకంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల తుది జాబితాలో ఉన్న అర్హులైన దివ్యాంగులు జనవరి 2వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోగా వారి సదరం / అంగవైకల్య నిర్ధారణ పత్రాలను మండల తహసిల్దార్ కార్యాలయంలో అందజేయాలని మంచిర్యాల మండల తహసిల్దార్ రాజేశ్వర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంచిర్యాల మండల పరిధిలో రెండు పడకగదుల పథకంలో లబ్ధిదారుల ఎంపిక కొరకు మీ సేవ నుండి 2 వేల 958 దరఖాస్తులు రాగా వీటిపై విచారణ జరిపి, అభ్యంతరాలు స్వీకరించి 27 మంది అనర్హులను గుర్తించడం జరిగిందని, 1వేయి 621 మంది అర్హుల తుది జాబితాను తయారు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఇట్టి జాబితా నుండి దరఖాస్తుదారుల సమక్షంలో పారదర్శకంగా లాటరీ పద్ధతిన లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించడం జరుగుతుందని తెలిపారు.