Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 30 December 2022, 6:45 pm Posted by : anjudega

గుండెపోటు తో హెడ్ కానిస్టేబుల్ మృతి

ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: అదిలాబాద్ తాంసి మండలంలో ఓ హెడ్ కానిస్టేబుల్ గుండెపోటు తో మృతి చెందారు. తంసి పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న ఏ. వి. రమణా రెడ్డి శుక్రవారం స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తుండగానే ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానిక పోలీసులు ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.