Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 30 December 2022, 6:53 pm Posted by : anjudega

డీజీపీ మహేందర్ రెడ్డి రాష్ట్రానికి చేసిన సేవలు ప్రశంసనీయం’

ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రానికి డీజీపీ మహేందర్ రెడ్డి చేసిన సేవలు ప్రశంసనీయమని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. రేపు (శనివారం) మహేందర్ రెడ్డి పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మంత్రి హైదరాబాద్ లక్ష్మీకపూర్ లోనీ తన కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డికి జ్ఞాపికను, పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి మహేందర్ రెడ్డి రాష్ట్రానికి సేవలందించారన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖను దేశంలోనే అగ్రస్థానంగా నిలిపారన్నారు.