Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 29 December 2022, 6:50 pm Posted by : Anjaneyulu Dega

ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించిన: మంత్రి హరిష్ రావు

బెల్లంపల్లి నియోజకవర్గంలో 14 కోట్లతో నూతనంగా నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి,

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి నియోజకవర్గంలో 14 కోట్లతో నూతనంగా నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, నూతన డయాలసిస్ కేంద్రం ప్రారంభించి, బెల్లంపల్లి ఏ.ఎమ్ సి 2 గ్రౌండ్ లో బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం కార్యక్రమానికి  బెల్లంపల్లి ఎమ్మెల్యే  దుర్గం చిన్నయ్య  అధ్యక్షతన ముఖ్య అతిథిలుగా తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖామంత్రి   తన్నీరు హరీష్ రావు , వ్యవసాయ, కో ఆపరేషన్, మార్కెటింగ్ శాఖామంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ,  అటవీ పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, దేవాదాయ, న్యాయ శాఖా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, హాజరయ్యారు. అనంతరం లబ్ధిదారులకు 8 కోట్ల డ్వాక్రా రుణాలు, రైతుభీమా చెక్కులు, కళ్యాణలక్మి, షాధిముభారఖ్ చెక్కులను అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రంలో నూతన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవం వెనుక తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు కేసిఆర్ కి బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలపై ఉన్న ప్రత్యేక ప్రేమ, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నిరంతర శ్రమ దాగి వుందని, వారి ప్రత్యేక కఠోర శ్రమ వల్లనే ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవం పూర్తి అయిందని, దాని ఫలితంగా బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకే కాకుండా మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల పేద ప్రజలకు వైద్యపర ఇబ్బందులు పూర్తిగా దూరం ఆవుతాయని తెలిపారు. అదేవిధంగా బెల్లంపల్లి నియోజకవర్గ సమస్యలు పూర్తి అవగాహన ఉండి ఆ సమస్యలను పరిష్కరించుటకు నిరంతరం శ్రమించే ఎమ్మెల్యే ఉండడం బెల్లంపల్లి ప్రజల అదృష్టమని తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్యే చెప్పిన నియోజకవర్గంలో ఉన్న ఇతర సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర మంత్రులుగా తాము పూర్తిగా సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో  పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్, మంచిర్యాల జిల్లా జడ్పీ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి-ఓదెలు, మంచిర్యాల ఎమ్మెల్యే  నడిపెళ్లి దివాకర్ రావు, మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతీ హోళీకెరీ, ట్రైన్ ని కలెక్టర్ గౌతమి, ఏసీపీ ఎడ్ల మహేష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ప్రవీణ్ , జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ , బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, నియోజకవర్గం ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారులు తదితరులు ఈ కార్యక్రమం లో  పాల్గొన్నారు.