Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 28 December 2022, 12:37 pm Posted by : Anjaneyulu Dega

రైల్వే గేట్ మూసివేయడంతో ప్రజల ఇబ్బందులు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని హమాలివాడ రైల్వే గేట్ మూసివేయడంతో టూటౌన్ ప్రాంతంలోని ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి బోయిని హరికృష్ణ తెలిపారు. బుధవారం బిజెపి నాయకులు సోమ ప్రదీప్ చంద్ర, ఆకుల సంతోష్ తో కలిసి రైల్వే గేట్ మూసివేసిన ప్రదేశాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే ఓవర్ బ్రిడ్జి, ఫుట్ ఓవర్ బ్రిడ్జి పూర్తయ్యే వరకు రైల్వే గేట్ మూసివేయవద్దని డిమాండ్ చేశారు.