కేసీఆర్ చేతిలో తెలంగాణ విధ్వంసం: రేవంత్ రెడ్డి
ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: దేశం, రాష్ట్రం ప్రమాదంలో ఉన్నాయని.. ఇలాంటి సమయంలో వ్యక్తిగత అంశాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా కాంగ్రెస్ శ్రేణులు ప్రజల కోసం పోరాడాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ 138వ ఆవిర్భావ దినోత్సం సందర్భంగా గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ జెండాను రేవంత్ ఆవిష్కరించారు. దేశ భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంటుంటే ప్రశ్నించలేని దౌర్భాగ్య స్థితిలో మోదీ సర్కార్ ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాహుల్ గాంధీ హెచ్చరించినా దేశ భద్రత కేంద్రానికి పట్టడం లేదని విమర్శించారు. జనవరి...