ప్రతి మొక్కను పరిరక్షించడం బాధ్యతగా తీసుకోవాలి

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: నాటిన ప్రతి ఒక్కరు పరిరక్షించడం బాధ్యతగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. మంగళవారం జిల్లాలోని జన్నారం మండలం రాంపూర్, తిమ్మాపూర్ గ్రామాలలో గల బృహత్ పల్లెప్రకృతి వనాలు, పల్లెప్రకృతి వనాలతో పాటు మన ఊరు - మన బడి అభివృద్ధి పనులను ట్రైనీ కలెక్టర్ గౌతమితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. భావితరాలకు ఆరోగ్యకరమైన సహజ వాయువును అందించడం, వాతావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు...