Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 27 December 2022, 1:16 pm Posted by : Anjaneyulu Dega

సర్పంచి భర్తపై కేసు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి మండలం కన్నాల పంచాయతీలోని లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన మహిళ పై సర్పంచి భర్త వెంకటస్వామి దాడికి పాల్పడటంతో పాటు అసభ్యపదజాలంతో దూషించినట్లు తాళ్లగురిజాల ఎస్సై రాజశేఖర్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం. అదే గ్రామానికి చెందిన శనిగారపు మల్లీశ్వరి అనే మహిళపై వెంకటస్వామితో పాటు పలువురు దాడికి యత్నించినట్లు పేర్కొన్నారు. వెంకటస్వామికి, మల్లీశ్వరికి భూవివాదం ఉన్నట్లు స్థానికులు పేర్కొన్నారు. సదరు మహిళకు చెందిన స్థలం ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నట్లు, ఈ క్రమంలో వారి మధ్య గతకొద్దికాలంగా వివాదం నడుస్తోందన్నారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు దాడి చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేశామని పోలీసులు వివరించారు.