Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 24 December 2022, 10:26 pm Posted by : Anjaneyulu Dega

రక్షకభటులు ప్రజలకు అన్నిటిలో రక్షణ

డబ్బులు డ్రా చేసి మర్చిపోయిన బాధితుడు

గమనించిన అరుణ్ పోలీసులకి సమాచారం ఇచ్చి నిజాయితీ చాటుకున్నాడు

వెంటనే విచారణ చేపట్టి బాధితునికి డబ్బులు అప్పగించిన మంచిర్యాల పోలీసులు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రోడ్డు మీద రూపాయి కనపడినా వదలని జనాలు ఉన్న రోజులు ఇవి. వెంటనే తీసుకుని జేబులో వేసుకుని వెళ్లిపోయే రకాలు ఉన్నారు. అలాంటి ఈ రోజుల్లోనూ పరుల సొమ్ము ఆశించని నిజాయితీపరులు ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. ఆంజనేయులు న్యూస్ వెబ్సైట్ ప్రకారం.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోనీ మార్కెట్ ఏరియాలోని సిటీ యూనియన్ బ్యాంక్ ఎటిఎం వద్ద అజయ్ అనే వ్యక్తి 28 వేల 500 రూపాయలు నగదు డ్రా చేసి నగదు ను మరచి వెళ్ళడం తో అరుణ్ అనే వ్యక్తి చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సిఐ నారాయణ నాయక్  ఆధ్వర్యంలో ఎస్సై సుగుణాకర్ తో కలిసి విచారణ చేపట్టి బాధిత యువకుడికి నగదును అందజేసారు. సదరు బాధిత యువకుడు సంతోషంగా మంచిర్యాల సిఐ గారికి పోలీసు సిబ్బందికి, కృతజ్ఞతలు తెలియజేశారు. వెంటనే విచారించి పోగొట్టుకున్న వ్యక్తికి డబ్బులు అందజేసిన మంచిర్యాల పోలీసుల ను స్థానికులు, మరియు పలువురు ప్రశంసలు అందజేశారు.