
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల నియోజకవర్గం హాజిపూర్ మండలం టీకానపల్లి గ్రామంలో ఎమ్మెల్యే తనయుడు నడిపెల్లి విజిత్ కుమార్ ఇంటింటి ప్రచారంలో భాగంగా శనివారం సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజాక్షేత్రంలో పర్యటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు.ఒకవైపు ప్రజలకు అందుతున్న సంక్షేమాభివృద్ధి ఫలాలను అడిగి తెలుస్కుంటూనే మరోవైపు ఏమైన సమస్యలు ఉంటే అడిగి తెలుసుకుని వాటికి పరిష్కార మార్గం చూపుతూ తండ్రికి తగ్గ తనయుడు అన్పించుకుంటున్నారు.