
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద బిఅర్ఎస్ పార్టీ అధ్వర్యంలో వడ్ల కుప్పలు రోడ్ పై ఉంచి మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మేల్యే దుర్గం చిన్నయ్య జెడ్పీ చైర్మన్ భాగ్యలక్ష్మి తో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన యువ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, అనంతరం నడిపెల్లి విజిత్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు ఉపాధి హామీ పథకం నిధులతో బావుల వద్ద కల్లాల నిర్మాణం కోసం దరఖాస్తులు చేసుకోగా నిధులు ఇవ్వబోమని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించడం రాష్ట్ర ప్రజలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడడమే అవుతుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రభుత్వ పరంగా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ విషయంలోని అన్ని రాష్ట్రాల అభివృద్ధిని కాంక్షించే విధంగా పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.