జిల్లా కేంద్రంలోని ప్రతిభ జూనియర్ కాలేజీలో గురువారం ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు.
ట్రాఫిక్ రూల్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న
మంచిర్యాల ట్రాఫిక్ సిఐ నరేష్ కుమార్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని ప్రతిభ జూనియర్ కాలేజీలో గురువారం ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ నరేష్ కుమార్ మాట్లాడుతూ. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేశారు. దేశభవిష్యత్ యువతరం చేతిలోనే ఉందని, విద్యార్థుల అందరికి ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన మరియు ప్రాముఖ్యత తెలియజేశారు. ప్రతిఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వాడకంపై అవగాహన మరియు వాహనాల ధ్రువీకరణ పత్రాల పై అవగాహన కల్పించారు. అలాగే నేటి సమాజంలో పెరుగుతున్న ఆధునికథతో పాటు పెరుగుతున్న సైబర్ క్రైమ్స్ పై విద్యార్థులకు అవగాహన మరియు ఫ్రొడ్ జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. ఇట్టి కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ శివకేశవులు, మరియు కాలేజ్ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.