Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 18 December 2022, 11:40 am Posted by : Anjaneyulu Dega

బంగారం తూకంలో మాయాజాలం

బంగారు ఆభరణాలు విక్రయించే బహుళజాతి సంస్థలు.. చెయిన్ స్టోర్స్… దుకాణాల్లో కొన్నింట తూకాల్లో తేడా ఉంటోంది. పండగల రాయితీలు… గ్రాము రూ.200 తక్కువ అంటూ ప్రకటనలతో ఆకర్షిస్తున్న కొన్ని సంస్థలు, దుకాణాల యాజమాన్యాలు మాయాజాలం ప్రదర్శిస్తున్నాయి.

డిజిటల్ త్రాసులపై తూనికలు.. కొలతల శాఖ నజర్

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: బంగారు ఆభరణాలు విక్రయించే బహుళజాతి సంస్థలు.. చెయిన్ స్టోర్స్. దుకాణాల్లో కొన్నింట తూకాల్లో తేడా ఉంటోంది. పండగల రాయితీలు. గ్రాము రూ.200 తక్కువ అంటూ ప్రకటనలతో ఆకర్షిస్తున్న కొన్ని సంస్థలు, దుకాణాల యాజమాన్యాలు మాయాజాలం ప్రదర్శిస్తున్నాయి. ఈ విషయమై కొనుగోలుదారుల నుంచి ఫిర్యాదులు అందుతుండటంతో తూనికలు. కొలతలు శాఖ అధికారులు డిజిటల్ త్రాసుల్లో లోపాలపై దృష్టి కేంద్రీకరించారు. మే. ఆగస్టు. అక్టోబరు. నవంబరు నెలల్లో తనిఖీలు నిర్వహించారు. 35 దుకాణాలు, చెయినోర్స్, బహుళజాతి సంస్థలపై కేసులు నమోదు చేసి జరిమానా విధించారు. ఇకపై తరచూ తనిఖీలు నిర్వహించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.