Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 16 December 2022, 5:23 pm Posted by : Anjaneyulu Dega

కార్మిక చట్టాల రద్దుకై -పోరాటాలకు పిలుపునిచ్చిన: సీఐటీయు

కార్పొరేట్ దాహానికి కార్మికులను బలిచేస్తున్న మోడీ ప్రభుత్వం

సీఐటీయు జిల్లా 2వ మహాసభల్లో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి ముత్యంరావు

అమలుకు నోచుకోని కనీస వేతనాలు చట్టం

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: దేశంలో మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులను, చట్టాలను ద్వంశం చేస్తూ కార్పొరేట్ దాహానికి కార్మికులను బలిచేస్తుందని సీఐటీయూ  రాష్ట్ర కార్యదర్శి ముత్యాంరావు ఆవేదన వ్యక్తం చేశారు. సీఐటీయూ జిల్లా 2వ మహాసభలు స్థానిక  టిఎన్.వి రమణ ప్రాంగణంలో (హరిత ఫంక్షన్ హాల్) నందు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. ముందుగా ఉమ్మడి జిల్లా సిఐటియు సీనియర్ నాయకులు సత్యనారాయణ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ముత్యంరావు మాట్లాడుతూ. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నుండి దాని సైద్ధాంతిక విభాగం అయిన ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో నడుస్తూ దేశంలో విచ్చిన్నకర మతోన్మాద ఎజెండాను కొనసాగిస్తోందని అన్నారు. నైతిక, రాజకీయ విలువలను తుంగలో తొక్కుతూ అప్రజాస్వామిక పద్ధతుల్లో అధికారానికి నిలబెట్టుకోవడానికి ఎంతకైనా దిగజారుతుందని అన్నారు. కార్పొరేట్ గుత్తపెట్టుబడి దారులకు దేశ సంపదను దోచిపెడ్తూ తన అధికారాన్ని సుస్థిరపర్చుకునెందుకు కేంద్రంలోని మోడీ బీజేపీ ప్రభుత్వం యావత్ దేశాన్నే అమ్మకానికి పెట్టిందని ఆరోపించారు.

అనంతరం త్రివేణి రాష్ట్ర కార్యదర్శులు బి. మధు, మాట్లాడుతూ. ఈ క్రమంలో కార్మికులను కార్పొరేట్ శక్తులకు కట్టుబానిసలుగా మార్చుతుందని అందుకోసం పుట్టుకొచ్చినవే లేబర్ కోడ్ లని అన్నారు. నూతన కార్మిక చట్టాల్లో యాజమాన్యాల సంక్షేమం కార్మికుల సంక్షోభం ఉందని అన్నారు. ఈ చట్టాలవల్ల కార్మికుడు కనీస జీతం అడిగే హక్కు, సమ్మె చేసే హక్కు లాంటి ఎన్నో కోల్పోతున్నారని అన్నారు. దేశంలో ఇప్పటికి రోజురోజుకు ఆకలి చావులు పెరుగుతుంటే ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్రం జాతి సంపద రైల్వే, బొగ్గు, విమానం, బీమా సంస్థలు, బ్యాంక్ లు లాటివి ప్రయివేటికరణ చేస్తూ చౌకగా కార్పొరేట్ పెట్టుబడిదారులకు అమ్ముతోందని అన్నారు. చివరికి దేశ రక్షణ రంగంలో కూడా ప్రయివేటు పెట్టుబలను ఆహ్వానిస్తోందని అన్నారు. మాటిమాటికి దేశభక్తి అనే బీజేపీ కరోన సమయంలో దేశ ప్రజలు పిట్టల్లా రాలుతున్న కనీస సహాయం అందించలేదని లక్షలాది మంది ఉపాధి కోల్పోయి ఇప్పటివరకు కొలుకోలేదని అన్నారు. నష్ట పోయిన వారిని అదుకోకుండా  లక్షల కోట్లను తన్నుకుపోయిన బడా బాబులకు వేలకోట్ల ఋణ మాపి లు చేసి దేశ భక్తి అంటు ఉరేగుతుందని అన్నారు. అది నిజమైన దేశ భక్తి కాదని అది దేశ ద్రోహం అవుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశానికి అన్నం పెట్టే రైతు, కార్మికులను మాత్రం తన నియంతృత్వ విధానాలతో నాశనం చేస్తుందని అన్నారు. అధికార దాహంతో రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చడానికి ప్రయత్నిచడం బీజేపీ కుటిల నీతి బట్టబయలు చేస్తుందని అన్నారు. దేశంలో మతోన్మాదం, మహిళలు, చిన్న పిల్లలపై అరాచకాలు జరుగుతున్న దేశ ప్రధానికి అవేంపట్టవని వారి రక్షణకు మాత్రం ఏ చట్టాలు తీసుకురారని ఎద్దవా చేశారు ప్రశ్నించే గొంతులను మాత్రం నామరూపాలు లేకుండా చేసే విధానాలు అవలభిస్తున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో దేశ భక్తి పేర బాగోద్వేషాలను రెచ్చగొడుతూ, ప్రశ్నించిన వారిపై రాజ్యాంగ సంస్థల పేర దాడులు చేస్తూ ప్రజలను మోసం చేసి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతకైనా తెగిస్తుందని అన్నారు. మేకిన్ ఇండియా, మెడిన్ ఇండియా నినాధాలుగానే మిగిలాయని, యువత ఉద్యోగాలు లేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే చూస్తూ ఆనందిస్తుందని అన్నారు. తన రాజకీయ ఎజెండా అమలుకు అడ్డు వచ్చే  ప్రజాస్వామ్య,రాజ్యాంగ వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేయ పూనుకుందని అన్నారు.ఇలాంటి విధ్వంసకర విధానాలకు భవిష్యత్తులో కార్మికవర్గపోరాటలే సరైన గుణపాఠం చెప్తాయని హెచ్చరించారు.
పి. ఆశన్న వృత్తి దారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి  మాట్లాడుతూ.. అదే దారిలో రాష్ట్ర ప్రభుత్వం విధానాలు ఉన్నాయని అన్నారు. మీదికి చూడ కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే కేసీఆర్ రాష్ట్రంలో ఎక్కడ ప్రత్యామ్నాయ విధానాలను అమలు చేయడం లేదని అన్నారు.గత 8 ఏండ్లుగా పెండింగులో ఉన్న 73 శడ్యూల్డ్ పరిశ్రమల జీఓ లను గెజిట్ చేసి అమలు చేయకుండా కార్మికుల పొట్టను కొడ్తున్నారని అన్నారు. ధరణి వెబ్సైట్ వల్ల అనేక మంది రైతులు ఆందోళన చెందుతున్నారని వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాలు ఇవ్వకుండా అనేక రంగాల కార్మికులు ఆందోళ బాట పడుతుంటే వారి సమస్యలు పరిష్కరించడం లేదని అన్నారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు పూనుకోవాలని అన్నారు. అర్హులైన అందరికి డబుల్ బెడ్రూలు కట్టించి ఇవ్వాలని, భూమి ఉన్న పేదలకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని అన్నారు.కేంద్రం రాష్టంలో బొగ్గు గనులు అమ్ముతుంటే ధీటుగా రాష్ట్ర ప్రభుత్వం తిప్పికొడడంలో విఫలం అవుతుందని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కేంద్రం విధానాలు తిప్పికొడ్తూ ప్రజా, కార్మికమోద విధానాలు అమలు చేసి తన విజ్ఞతను చాటాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ముంజం శ్రీనివాస్ కొమురంభీం జిల్లా కార్యదర్శి, సీనియర్ నాయకులు జలాలుద్దీన్,హన్మంత్ రెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అబ్బోజు రమణ, దుంపల రంజిత్ కుమార్, జిల్లా కోశాధికారి రామస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు ప్రకాష్, రాజేశ్వరి, సంకె రవి, వెంకటస్వామి, రాజారాం,శ్రీనివాస్, భాగ్యరాజు, కుమారి,సమ్మక్క, భానుమతి, రాజలింగు, బుచ్చన్న, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అశోక్,పైరాల రాములు రజక వృత్తి దారుల సంఘం జిల్లా కార్యదర్శి, ప్రజా నాట్యమండలి అశోక్, సుధాకర్,మరియు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.