Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 16 December 2022, 10:14 pm Posted by : Anjaneyulu Dega

నకిలీ రెగ్యులేటర్లు విక్రయిస్తే కఠిన చర్యలు

జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: గృహాలు, వ్యాపార అవసరాల నిమిత్తం వినియోగించే గ్యాస్ సిలిండర్లకు ఉపయోగించే రెగ్యులేటర్ల విషయంలో నకిలీ వాటిని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మార్కెట్ ప్రాంతంలో నకిలీ రెగ్యులేటర్ల విక్రయాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ. నకిలీ రెగ్యులేటర్లు విక్రయిస్తున్నట్లుగా తమ దృష్టికి రాగా మార్కెట్ రోడ్ లోనీ డైమండ్ అప్లియన్సెస్ లో తనిఖీలు చేపట్టగా హెచ్.పి.సి.ఎల్. ఐ.ఓ.సి.ఎల్. బి.పి.సి.ఎల్.కు సంబంధించిన  రెగ్యులేటర్లు విక్రయిస్తున్నట్లుగా నిర్ధారించడం జరిగిందని, షాపు యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు రెగ్యులేటర్లు కొనుగోలు సమయంలో అప్రమత్తంగా ఉండాలని, తక్కువ ధరకు వస్తున్నాయని నకిలీ వాటిని కొనుగోలు చేయవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.