విద్యార్థులకు అలర్ట్.. ఈ నకిలీ వెబ్సైట్ తో జాగ్రత్త!

CBSE పేరుతో నకిలీ వెబ్సైట్ పేరిట డబ్బులు వసూలు చేస్తున్నట్లు పీఐబీ దృష్టికి వచ్చింది. ఇలాంటి వాటి పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలంటూ ట్వీట్ చేసింది. ఆంజనేయులు న్యూస్: సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. అవకాశం ఉన్న చోట అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా సీబీఎస్ఈ (CBSE) విద్యార్థులే లక్ష్యంగా మోసాలకు దిగారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పేరిట ఓ నకిలీ వెబ్సైట్ తెరిచి కొత్త దందాకు తెరతీశారు. రిజిస్ట్రేషన్ ఫీజు పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు దృష్టికి రావడంతో ప్రెస్ ఇన్ఫర్మేషన్...