Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 15 December 2022, 9:00 pm Posted by : Anjaneyulu Dega

పునరావాస కేంద్రంకు ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ చేయూత

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని తిలక్ నగర్ లో ఉన్న దివ్యాంగులు, వయోవృద్ధుల పునరావాస కేంద్రం కు ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ చేయూత అందించింది. పునరావాస కేంద్రం శిథిలావస్థలో ఉండి దివ్యాంగులు, వయోవృద్ధులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ట్రస్ట్ సభ్యుల దృష్టికి తెలుసుకున్నారు. వెంటనే స్పందించిన వారు గురువారం ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ. 20 వేలు రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు సట్ల మహేందర్, ప్రధాన కార్యదర్శి బీనవెన సంపత్, కోశాధికారి తూముల సురేష్, సమాచార కార్యదర్శి బండారి భుమేష్ సభ్యులు జెట్టి శ్రీనివాస్, జోగునూరి సతీష్, కొడిపాక అశోక్ పాల్గొన్నారు.