Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 06 December 2022, 4:42 am Posted by : Anjaneyulu Dega

మహిళల రక్షణకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో షీ టీమ్ ఏర్పాటు

మహిళలు, బాలికలు, విద్యార్థిని, విద్యార్థుల రక్షణకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో షీ టీమ్ ఏర్పాటు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

ఆంజనేయులు న్యూస్, రామగుండం పోలీస్ కమిషనరేట్: మహిళలు, బాలికలు, విద్యార్థిని, విద్యార్థుల రక్షణకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో షీ టీమ్ ఏర్పాటు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి సోమవారం తెలిపారు. కమిషనరేట్ లో రెండు షీ టీం బృందాలు పని చేస్తూ మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తునట్లు పేర్కొన్నారు. మహిళలు, బాలికలపై ఆన్ లైన్ లో అసభ్యకర పోస్టులు పెట్టే సైబర్ నేరగాళ్లపై కూడా సైబర్, షీ టీమ్ సమన్వయంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలో పాఠశాలలు, కళాశాలలను ఎంపిక చేసి ఒక్కో పాఠశాలకు ఇద్దరు చొప్పున విద్యార్థినులకు సైబర్ నేరాలు, ఈవ్ టీజింగ్, ఆకతాయిల వేధింపులను అరికట్టడంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి సైబర్ అంబాసిడర్లుగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ఆపదలో ఉన్న మహిళలు బాలికలు విద్యార్థిని విద్యార్థులు వెంటనే రామగుండం పోలీస్ కమిషనరేట్ షీ టీం ఫోన్ నెంబర్ 6303923700కు కాల్ చేసినా, వాట్సాప్ ద్వారా సందేశం పంపించి వెంటనే షీ టీమ్స్ సహాయం పొదలని తెలిపారు.