
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: నెన్నెల మండల కేంద్రానికి చెందిన హోం గార్డు ఫిరోజ్ ఖాన్ అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మరణించాడు. విషయం తెలుసుకున్న నెన్నెల ఎస్సై రాజశేఖర్, హోం గార్డు మంచిర్యాల జిల్లా ఇంచార్జి లక్ష్మీనరసింహ హోం భౌతికాయానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. పోలీసు శాఖ తరుపున తక్షణ సాయం కింద 15 వేల రూపాయల నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సై రాజశేఖర్ మాట్లాడుతూ ఫిరోజ్ ఖాన్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని, డిపార్ట్మెంట్ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ సకాలంలో అందేలా చర్యలు తీసుకొని అన్ని విధాలుగా ఆడుకుంటామన్నారు ఆయన వెంట బెల్లంపల్లి హోం గార్డు ఇంచార్జి రాం సింగ్, జైపూర్ హోం గార్డు ఇంచార్జి రాజు, పోలీసు సిబ్బంది, హోం గార్డులు ఉన్నారు.