Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 06 December 2022, 2:11 am Posted by : Anjaneyulu Dega

మినీ స్టేడియంలో వసతులకు నిధులను మంజూరు చేయాలి

హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కలిశారు.

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కలిశారు. ఈ సందర్భంగా చెన్నూరు పట్టణంలో రూ.2.65 కోట్లతో 6. 34 ఎకరాల్లో నిర్మిస్తున్న మినీ స్టేడియంలో వసతుల కొరకు అదనపు నిధులను మంజూరు చేయాలని కోరారు. మినీ స్టేడియం కాంపౌండ్ వాల్ కు 75 లక్షలు, ఇండోర్ స్టేడియంలో మిగిలి ఉన్న పనులకు, బాస్కెట్ బాల్, టెన్నిస్ బాల్ కోర్టుల నిర్మాణానికి 40 లక్షలు, 10 హైమాస్ లైట్ల ఏర్పాటుకు 20 లక్షలు, వీధి దీపాల కొరకు 15 లక్షలు, మొక్కలు, గడ్డి కొరకు 20 లక్షల అదనపు నిధులను సమకూర్చాలని వినతి పత్రం అందించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ త్వరలోనే నిధులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. మినీ స్టేడియం నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని అదనంగా సమకూరిన నిధులతో అతి త్వరలోనే పనులు పూర్తి చేసి పట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు.