మహిళలపై అనుచిత వ్యాఖ్యలు.. రాందేవ్ బాబా క్షమాపణలు
దుస్తులు ధరించకపోయినా మహిళలు అందంగా ఉంటారంటూ యోగా గురువు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో ఆయన క్షమాపణలు తెలిపారు. ఆంజనేయులు న్యూస్, ముంబయి: మహిళల వస్త్రధారణపై ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా (Ramdev Baba) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తోన్న నేపథ్యంలో ఆ వ్యాఖ్యలపై రాందేవ్ క్షమాపణలు తెలిపారు. మహిళలను కించపర్చాలన్న ఉద్దేశం తనకు లేదని, తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడినట్లయితే అందుకు తనను క్షమించాలని...