పలు పాఠశాలలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: తాండూరు మండలంలోని ఎంపీపీఎస్ గోపాల్ నగర్, ఎంపీపీఎస్ రేచిని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంపీపీఎస్. గోపాల్ నగర్ పాఠశాలలో మన ఊరు - మన బడి ద్వారా చేపట్టిన పనులను పూర్తి చేసినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయాలు సుధాకర్ మరియు కాంట్రాక్టర్ నారాయణను అభినందించారు. అదే విధంగా తాలిమెట్టు కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల కనీస అభ్యసన సామర్ధ్యాలతో పాటు తరగతికి చెందిన అభ్యసన సామార్థ్యాలను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం...