
ఆంజనేయులు న్యూస్, నిర్మల్ జిల్లా: లక్ష్మణచందా మండలం పార్ పల్లి గ్రామంలో దారుణ హత్య జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం. గ్రామానికి చెందిన శివరాత్రి మహేష్, కొంచేపు సాయన్నకు ఇంటిస్థలం విషయంలో తరుచూ గొడవలు జరుగుతుండేవి. ఈ విషయంలో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి ఇరువురికి నచ్చజెప్పారు. ఈ క్రమంలో గురువారం రాత్రి మళ్ళీ గొడవ జరగడంతో మహేష్ పై సాయన్న దాడి చేశాడు. దాడిలో మహేష్ తలకు, శరీరంలో బలమైన గాయలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న డీఎస్పీ జీవన్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు. నిందితున్ని కఠినంగా శిక్షించి, మహేష్ కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. ముందస్తు చర్యలో భాగంగా గ్రామంలో పోలీసులు టికెటింగ్ చేపట్టారు.