రోడ్డు మంచినీటి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు
ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: ఇంద్రవెల్లి మండలం బూర్సన్ పటర్ గ్రామాన్ని ఖానాపూర్ కాంగ్రెస్ నాయకులు వినోద్ నాయక్ బుధవారం మధ్యాహ్నం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యలను విన్నవించుకున్నారు. వినోద్ నాయక్ మాట్లాడుతూ. మండల కేంద్రానికి కేవలం 3కిమీ దూరంలో ఉన్న గ్రామానికి రోడ్డు, మంచినీటి సౌకర్యం లేక జనాలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎమ్మెల్యే రేఖా నాయక్ పాలన ఎంత అద్భుతంగా ఉందో అర్థమవుతుందని విమర్శించారు. కల్వర్ట్ లు దెబ్బతిని నెలలు గడుస్తున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇటీవల...