Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 23 November 2022, 3:25 pm Posted by : Anjaneyulu Dega

రోడ్డు మంచినీటి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు

ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: ఇంద్రవెల్లి మండలం బూర్సన్ పటర్ గ్రామాన్ని ఖానాపూర్ కాంగ్రెస్ నాయకులు వినోద్ నాయక్ బుధవారం మధ్యాహ్నం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యలను విన్నవించుకున్నారు. వినోద్ నాయక్ మాట్లాడుతూ. మండల కేంద్రానికి కేవలం 3కిమీ దూరంలో ఉన్న గ్రామానికి రోడ్డు, మంచినీటి సౌకర్యం లేక జనాలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎమ్మెల్యే రేఖా నాయక్ పాలన ఎంత అద్భుతంగా ఉందో అర్థమవుతుందని విమర్శించారు. కల్వర్ట్ లు దెబ్బతిని నెలలు గడుస్తున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇటీవల కల్వర్ట్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగి బ్రహ్మనంద వాగమరే అనే వ్యక్తి మృతి చెందడంతో ఐదుగురు ఆడపిల్లలు ఉన్న వారి కుటుంబం రోడ్డున పడిందన్నారు. దళిత వర్గంకి చెందిన ఆ కుటుంబానికి ఎమ్మెల్యే ఎటువంటి కమీషన్ తీసుకోకుండా దళిత బంధు పథకం వర్తింపచెయ్యాలని డిమాండ్ చేశారు. మరో 15 రోజుల్లో గ్రామానికి రోడ్డు, మంచినీటి సమస్య అలాగే బాధిత కుటుంబానికి దళిత బంధు హామీ నెరవేర్చని యెడల గ్రామస్తులు అందరితో కలిసి తహసీల్దార్ కార్యాలయం ముట్టడిస్తాం అని హేచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్ రావు, నాయకులు భగవాన్, భావరాజ్, పీరాజీ, గోవింద్, భారత్, రాజు నాయక్, గ్రామస్తులు పాల్గొన్నారు.