Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 23 November 2022, 3:50 pm Posted by : Anjaneyulu Dega

పోలీస్ కుటుంబాలకు అండగా నిలుస్తాం.

మరణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు భద్రత చెక్ అందజేసిన:  సీపీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి

ఆంజనేయులు న్యూస్, రామగుండం పోలీస్ కమిషనరేట్: కన్నెపల్లి పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ ఎం. సత్తయ్య-1707, గుండెపోటు తో మరణించగా ఆయన భార్య ప్రేమలత, కుమారుడు కి  భద్రత ఎక్స్గ్రేషియా  7,93,545 (ఏడు లక్షల తొంబై మూడు వేల ఐదు వందల నలభై ఐదు రూపాయల) చెక్ ను బుధవారం సీపీ కార్యాలయం లో రామగుండం పోలీస్ కమీషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్(ఐజీ) అందజేశారు. ఈ సందర్భంగా మరణించిన కానిస్టేబుల్ కుటుంబ ప్రస్తుత స్థితిగతులను సీపీ అడిగి తెలుసుకోవడంతో పాటు, వారి కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రభుత్వపరంగా అందాల్సిన ఇతర బెనిఫిట్లను తక్షణమే అందజేసేవిదంగా చూస్తామని తెలియజేశారు. పోలీస్ సిబ్బంది కుటుంబాల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం తో పాటు వారి కుటుంబాలకి అండగా ఉంటామని రామగుండం పోలీస్ కమీషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్, అన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లాకుంట పోచలింగం, సూపరింటెండెంట్ శ్రీనివాస్, సీసీ శ్రావణ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ నజియా ఇరామ్ పాల్గొన్నారు.