
ఇంచార్జ్ జిల్లా సంక్షేమ అధికారి హేమ సత్య
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: బాలలు క్రమశిక్షణతో, సన్మార్గంలో, మంచి నడవడికతో పెరిగి సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ భావి భారత పౌరులుగా ఎదగాలని ఇంచార్జ్ జిల్లా సంక్షేమ అధికారి హేమ సత్య అన్నారు. సోమవారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని కస్తూరిబా బాలికల విద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇన్చార్జి జిల్లా సంక్షేమ అధికారి మాట్లాడుతూ స్వాతంత్రం అనంతరం భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ జన్మదినోత్సవాన్ని బాలల దినోత్సవం గా జరుపుకుంటామని, బాలలు మహనీయుల ఆశయాలను ఆచరిస్తూ, మహానుభావుల మార్గదర్శకాలు స్ఫూర్తిగా ఎదిగి దేశాభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. బాలల అభివృద్ధికి మహిళా శిశు సంక్షేమ శాఖ, డి.సి.పి.యు., చైల్డ్ లైన్ దోహదపడతాయని పేర్కొన్నారు. బాలలు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో లక్షట్టిపేట సి.డి.పి.ఓ. రేష్మ, బెల్లంపల్లి సి.డి.పి.ఓ. మాస ఉమాదేవి, మంచిర్యాల సి.డి.పి.ఓ. స్వరూప రాణి, జిల్లా బాలల సంరక్షణ అదికారి ఎన్. ఆనంద్, చైల్డ్ లైన్ కో-ఆర్డినేటర్ సత్యనారాయణ, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం ప్రత్యేక అధికారి స్వప్న, సంబంధిత అధికారుల, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.