
మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హొళ్ళీకెరీ.
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: భూ సమస్యల పరిష్కారం, క్రమబద్ధీకరణ కొరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్ దరఖాస్తులలో సందేహాల నివృత్తి కొరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ భారతి హోలీకెరీ ఒక ప్రకటనలో తెలిపారు. ధరణి పోర్టల్ లో 33 మాడ్యూల్స్ లో భూములకు సంబంధించిన వివిధ రకాల సమస్యల పరిష్కారం కొరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, జిల్లాలోని రైతులు ధరణి పోర్టల్ లో దరఖాస్తు చేసుకొనుటకు వివరాలపై ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కార్యాలయ పని వేళలలో హెల్ప్ డెస్క్ లో సంప్రదించవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.