శంకుస్థాపనలకే పరిమితం కాలేదు.. పూర్తి చేసి చూపించాం: ప్రధాని మోదీ

భవిష్యత్ లో భారత్ యూరియా పేరిట ఒకటే బ్రాండ్.. సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ఆలోచన కేంద్రానికి లేదు" ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆంజనేయులు న్యూస్, రామగుండం: తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. తొలుత ఆర్ఎఫ్సీఎల్ సందర్శన అనంతరం ఎన్టీపీసీ టౌన్ షిప్ ని మైదానంలో రైతులతో నిర్వహించిన బహిరంగసభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎరువుల కర్మాగారాన్ని, భద్రాచలం నుంచి సత్తుపల్లి వరకు నిర్మించిన...