Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 10 November 2022, 2:28 pm Posted by : Anjaneyulu Dega

మరో దిల్లీ మద్యం కుంభకోణం.. ఇద్దరు తెలుగువాళ్లు అరెస్టు

ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. మద్యం వ్యాపారంతో సంబంధం ఉన్న మరో ఇద్దరిని అరెస్టు చేసింది.

ఆంజనేయులు న్యూస్, దిల్లీ: దిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. మద్యం వ్యాపారంతో సంబంధం ఉన్న మరో ఇద్దరిని అరెస్టు చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పెనక శరత్ చంద్రారెడ్డి, మద్యం వ్యాపారి వినయ్ బాబు ను అరెస్టు చేసినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఇద్దరికి రూ. కోట్ల విలువైన మద్యం వ్యాపారం ఉందని ఈడీ పేర్కొంది. దిల్లీ మద్యం పాలసీకి అనుగుణంగా ఈఎండీలు చెల్లించినట్లు శరత్ పై అభియోగాలున్నాయి. శరత్ చంద్రారెడ్డి అరబిందో గ్రూపులోని 12 కంపెనీలకు, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ సంస్థలోనూ డైరెక్టర్ గా ఉన్నారు.

మద్యం కుంభకోణం కేసులో ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ ను ఎఫ్ఆర్ఐ లో గతంలో సీబీఐ ఎఫ్ఆర్ఐ చేర్చింది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. దీనిలో భాగంగా సెప్టెంబర్ 21, 22, 23 తేదీల్లో దిల్లీలో శరత్ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. దిల్లీ లిక్కర్ పాలసీకి అనుగుణంగా ఈఎండీలను శరత్ చెల్లించారు. ఈ క్రమంలోనే ఆయన్ను విచారించిన ఈడీ.. గురువారం దిల్లీలో అరెస్ట్ చేసింది. ఈ కేసులోనే గతంలో హైదరాబాద్ కు చెందిన రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పి డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్ ను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.