Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 09 November 2022, 3:56 pm Posted by : Anjaneyulu Dega

మోడీ పర్యటనను బహిష్కరించాలి

సిపిఐ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రేగుంట చంద్రశేఖర్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 12న రామగుండం కు వస్తున్న పర్యటనను బహిష్కరించాలని సిపిఐ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రేగుంట చంద్రశేఖర్ తెలిపారు బుధవారం బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 12 న ప్రధాని మోదీ రామగుండం పర్యటనకు వ్యతిరేకంగా మోదీ గో బ్యాక్ నినాదం తో భాహిష్కరించలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర విభజన సమస్యలను ప్రక్కన పెట్టి వున్న ప్రభుత్వ రంగ సంస్థల ను అంబానీ అదాని లకు అమ్మి వేస్తూ ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభం పేరుతో నాటకాలు ఆడుతున్నారని అన్నారు. తెలంగాణ సమస్యలను పరిష్కరించకుండా అడుగు పెట్టే హక్కు మోదీ కీ లేదు అని అన్నారు. ఈ ప్రెస్ మీట్ లో రాష్ట్ర సమితి సభ్యులు బొల్లం పూర్ణిమ, జిల్లా కార్యవర్గ సభ్యులు దాగం మల్లేష్, జిల్లా సమితి సభ్యులు  బి.లక్ష్మి నారాయణ, అదేపు రజమోగిలి, ఏళ్తురీ శంకర్, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ నాయకులు అక్కేపల్లి బాపు, పట్టణ కమిటీ సభ్యులు బొంకురి రాంచందర్, పులిపాక స్వామి, మహేందర్ రెడ్డి, రత్నం రాజం లు పాల్గొన్నారు.